BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 01 June 2026, 06:16 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
01 Jun, 2026 - 06:16 PM
129 వీక్షణలు

విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు  ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు నిర్వహించారు. 

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా  శాశ్వత పరిష్కారాన్ని అందించాలని అన్నారు.


ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 19 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు  పై 6 ఫిర్యాదులు నమోదు కాగా, రెవెన్యూ 2, ఇంజనీరింగ్ 9, ప్రజారోగ్య శాఖలకు సంబంధించిన 1, పి ఓ యుసిడి 1 పలు సమస్యలను కూడా ప్రజలు అదనపు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. 


ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ సి హెచ్ రత్న బాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ ఏజే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి

విజయవాడ నగరపాలక సంస్థ