BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 30 May 2026, 11:37 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 11:37 AM
177 వీక్షణలు

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని పలు విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల లైసెన్సులు, ఫారాలు, ఇన్వాయిస్లు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.

విత్తనాల నిల్వలు వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని డీలర్లకు సూచించారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో లాట్ నంబర్, పంట పేరు, వెరైటీ లేదా హైబ్రిడ్ వివరాలను బిల్లులో నమోదు చేసి, డీలర్‌తో పాటు రైతు సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.

నాసిరకం లేదా లూజు విత్తనాల విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు లైసెన్సు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి, బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు ఆ బిల్లును భద్రంగా ఉంచుకోవాలన్నారు.

ప్రత్తి సహా ఇతర పంటల విత్తనాలను అనధికారికంగా లూజుగా విక్రయిస్తే వాటిని నకిలీ విత్తనాలుగా పరిగణించి, సమాచారం అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు లూజు విత్తనాల కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా, వివిధ వరి విత్తనాల నమూనాలను నాణ్యత పరీక్షల కోసం విత్తన పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ వెల్లడించారు.