BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 June 2026, 06:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరి రైతులకు ముఖ్య సూచన – విత్తన శుద్ధి తప్పనిసరి: బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:41 PM
105 వీక్షణలు

వరి రైతులకు ముఖ్య సూచనలుగా మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ విత్తన శుద్ధి తప్పనిసరి అని స్పష్టం చేశారు. వరి సాగు చేసే రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా షాపు నుండి బిల్లులు పొందాలని ఆయన సూచించారు. అలాగే విత్తనాల మొలక శాతాన్ని ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నారుమడి వేయడానికి ముందు విత్తన శుద్ధి చేయడం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన విత్తన శుద్ధి చేయడం ద్వారా గింజలపై ఉండే కంటికి కనిపించని సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు నశిస్తాయని చెప్పారు. దీంతో ప్రధాన పొలంలో పురుగుమందులు, శిలీంధ్ర నాశకాలు స్ప్రే చేసే ఖర్చు కూడా తగ్గుతుందని వివరించారు. విత్తన శుద్ధికి ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ 25 శాతం + టేబుకోనజోల్ 50 శాతం మిశ్రమాన్ని 1 కేజీ విత్తనానికి 1 నుండి 1.5 గ్రాములు లేదా కార్బెండజిమ్ 50 శాతం (బావిస్టిన్) ను 1 కేజీ విత్తనానికి 2 నుండి 2.5 గ్రాములు వాడాలని సూచించారు. అలాగే కార్బెండజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల మోతాదులో ఉపయోగించవచ్చని తెలిపారు. విత్తనాన్ని శుద్ధి చేసిన తరువాత 24 గంటలు ఉంచి ఆపై విత్తుకోవాలని ఆయన సూచించారు. ఈ విధంగా విత్తన శుద్ధి చేయడం ద్వారా బ్లాస్ట్, కుళ్లు వంటి తెగుళ్లు తగ్గి పంటకు ఎటువంటి నష్టం లేకుండా మంచి మొలక శాతం పొందవచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది. కావున రైతులందరూ తప్పనిసరిగా విత్తన శుద్ధి పాటించాలని బి శివశంకర్ సూచించారు.