BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 11 April 2026, 12:22 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 12:22 PM
157 వీక్షణలు

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది (2026-27) పొడిగింపు

 చిత్తూరు ఏప్రిల్ 10 : 

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్తు స్కీమ్ ను మరో ఏడాది అనగా 2026-27 ఆర్థిక సంవత్సరంనకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ జిఓఎంస్ సంఖ్య 43 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారనీ, జిల్లాలోని అక్రెడిటేటెడ్ జర్నలిస్టులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని

DMAC కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జిఓం ఎంస్ సంఖ్య 12 ద్వారా 2015లో అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) మాదిరిగా వివిధ ఎంపానల్డ్ ఆసుపత్రుల ద్వారా గుర్తింపు పొందిన అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా క్యాష్ లెస్ వైద్య సేవలు అందించే లక్ష్యంతో వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్(JHS)ను ప్రవేశపెట్టడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులు మరియు అత్యవసర శస్త్రచికిత్సలతో సహా ప్రభుత్వం నిర్ణయించిన వందలాది వైద్య విధానాలు (Therapies) ఈ పథకం కింద కవర్ చేయబడతాయి. కాలానుగుణంగా ఈ  పథకాన్ని ప్రతి ఏటా అనగా 2016-17 నుండి 2025-26 వరకూ పొడిగించడం జరిగింది. మరలా ఈ వర్కింగ్ జర్నలిస్టుల కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్ ను మరో ఏడాది కాలానికి అనగా 2026-27 కు పొడిగించాలన్న సాధారణ పరిపాలన శాఖ(ఐఅండ్ పిఆర్) విజ్ణప్తి మేరకు ప్రభుత్వం ఈనెల 1వ తేదీ నుండి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుని ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పొడింగింపు ఉత్తర్వులకు అనుగుణంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డా.ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మరియు సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ ఆఉత్తర్వుల్లో పేర్కొన్నారని వారు ఆ ప్రకటనలో తెలిపారు.