BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 27 July 2026, 04:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాల కోసం నెమలి దేవస్థానంలో వరుణ యాగం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jul, 2026 - 04:04 PM
65 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో లోకకళ్యాణార్థం సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు టీ. గోపాలచార్యులు ఆధ్వర్యంలో వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు.

అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులకు అనుకూలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ ఎన్. సంధ్య, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.