BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీటిని వెంటనే తొలగించాలి

తెలంగాణ
31 Oct, 2025 - 10:14 AM
377 వీక్షణలు
రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో నీటిని వెంటనే తొలగించాలి. NTODAY NEWS: రామన్నపేట,యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక రైల్వే స్టేషన్ ముందు విద్యార్థుల ధర్నా. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పరిధిలో కొమ్మాయిగూడెం, సిరిపురం రైల్వే అండర్ పాస్ వంతెన వద్ద వర్షం మూలంగా నిలిచిపోయిన నీటిని తొలగించి విద్యార్థులు గ్రామాల ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జెల్లల పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. సిపిఎం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి స్థానిక రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం సంబంధిత అధికారి పీడబ్ల్యూ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే అధికారుల ముందు చూపు లేక అండర్పాస్ వే నిర్మాణం చేయగా వర్షాలు పడినప్పుడు నీళ్లు నిలిచిపోయి నిత్యం ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గత రెండు రోజులుగా వడ్ల లారీ మధ్యలోనే ఆగిపోయి ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నారని, స్థానిక మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు బస్సులు రాక తల్లిదండ్రులు ప్రతినిత్యం చుట్టూ తిరిగి వారి వెంటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని మూలంగా విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని,రైతులు పండించిన పంట కనీస మార్కెట్ కు చేర్చలేకపోతున్నారని, నిత్యం మండల కేంద్రానికి చౌటుప్పల్ కు వెళ్లే ప్రయాణికులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అనేకసార్లు విన్నవించిన రైల్వే అధికారులు పట్టించుకోవడంలేదని, తమ రైళ్లకు 10 నిమిషాలు అంతరాయం కలిగిన వెంటనే స్పందించే రైల్వే అధికారులు గత పది రోజులుగా ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీటిని తొలగించి ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చూడాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ధర్నాకు స్పందించిన రైల్వే అధికారులు సమస్యను వెంటనే పరిష్కారం చేస్తామని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వగా అనంతరం ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బలుగూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నర్సింహా చారి, కల్లూరి నాగేష్, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు,డివైఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు శానగొండ రామచంద్రం, మెట్టు శ్రవణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, శానకొండ వెంకటేశ్వర్లు, అప్పం సురేందర్, నాగటి లక్ష్మణ్, ఆకిటి శ్రీను, ఉన్న దత్తాద్రి, కుమారస్వామి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube