BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 November 2025, 11:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చేనేతకు చేయూత ఏదీ?

తెలంగాణ
06 Nov, 2025 - 11:28 AM
364 వీక్షణలు
చేనేతకు చేయూత ఏదీ? NTODAY NEWS: ప్రత్యేక కథనం ముడి సరుకు ధరలు పైపైకి గిట్టుబాటు ధర రాక కార్మికులు విలవిల పేరుకున్న ఆప్కో బకాయిలు ఒకప్పుడు చేనేత కార్మికులకు చేతినిండా పని ఉండేది. అందుకు తగ్గట్లు ఫలితం దక్కేది. కూలి గిట్టుబాటు అయ్యేది. ప్రభుత్వ విధానాలతో ఈ రంగం కళావిహీనం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న నేతన్నలకు భంగపాటు తప్పలేదు. ఉచిత విద్యుత్‌ పథకాన్ని అరకొరగానే అమలు చేస్తోంది. మరోవైపు ‘నేతన్న నేస్తం’ నిలిచిపోయింది. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో నేసిన చీరల ధర పెరగడంతో కొనేవారులేక కార్మికులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నారు. గతంలో కిలో పట్టు రూ.3 వేలు ఉండేది. ఆ తర్వాత రూ.5 వేలకు పెరిగింది. ప్రస్తుతం రూ.8 వేలకు చేరింది. జరీ కట్ట రూ.325 ఉండేది. ఈ ఏడాది రూ.500 నుంచి రూ.600కు పెరిగింది. రంగులు గతంలో రూ.150 నుంచి రూ.170 ఉండగా, ప్రస్తుతం వీటి ధర రూ.300 నుంచి రూ.500కి చేరింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 50 సహకార సంఘాల్లో సుమారు 30 వేల మంది చేనేత కార్మికులుగా నమోదయ్యారు. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద పనిచేస్తున్న వారు మరో 40 వేల మంది ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 15,700 మగ్గాలు ఉన్నాయి. వీటిలో సహకార రంగంలో 11,980, సహకారేతర రంగంలో 3,720 నడుస్తున్నాయి. గత మూడు నెలలుగా చాలా మగ్గాలు పనిలేక మూతబడ్డాయి. అమలు కాని ముఖ్యమంత్రి హామీ గత వైసిపి ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో ఒక్కొక్కరికీ రూ.24 వేలు ఏటా సాయం అందించింది. 2023 జులైలో కోనసీమ జిల్లాలో 4,279 మందికి, కాకినాడ జిల్లాలో 2,778 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 916 మందికి చివరిగా అందింది. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా నేతన్న నేస్తం ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఆగస్టు ఏడున మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అతి త్వరలో ‘నేతన్న నేస్తం’ కింద రూ.25 వేల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. జిఎస్‌టి రీయింబర్స్‌ చేస్తామని చెప్పినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. చేనేత మగ్గాలు ఉన్నవారికి 200 యూనిట్లు, పవర్‌ లూమ్‌లకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని ఆగస్టు 7న చేనేత దినోత్సవం రోజున చంద్రబాబు హామీ ఇచ్చి అదే రోజు నుంచి అమలు కానుందని ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో వంద యూనిట్ల వరకు ఈ పథకం అమలు అవుతున్నప్పటికీ మిగిలిన జిల్లాల్లో అమలు కావడం లేదు. కరెంటు సబ్సిడీ మాట అటుంచి విద్యుత్‌ ఛార్జీలను మాత్రం విపరీతంగా పెంచారు. 2017 నుంచి సహకార సంఘాలకు, చేనేత కార్మికులకు వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.177 కోట్లు బకాయిలను ప్రభుత్వం పెండింగులో ఉంచింది. 2018 నుంచి ఆప్కోకు పాలక వర్గం ఏర్పాటు కాలేదు. దీంతో, అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కష్టానికి తగిన ఫలితం లేదు రోజంతా కుటుంబం మొత్తం కష్టపడితే రూ.300 మించి కూలి రావడం లేదు. చేనేత రంగం కుదేలవుతున్న నేపథ్యంలో చాలా మంది ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. ప్రభుత్వం జిఎస్‌టి రీయింబర్స్‌ చేస్తామని చెప్పి మాట తప్పింది. – ఎస్‌.చక్రధర్‌, చేనేత కార్మికుడు, తాడిపర్తి, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా చేనేత రంగాన్ని ఆదుకోవాలి గతంలో రోజుకి రూ.600 నుంచి రూ.800 వరకూ కూలి వచ్చేది. ఇప్పుడు రూ.300 మించి రావట్లేదు. నేతన్న నేస్తం, ఇతర సంక్షేమ పథకాలను, ఉచిత విద్యుత్తు హామీని అమలు చేయాలి. ఆప్కోకు పాలకవర్గాలను తక్షణమే నియమించాలి. బకాయిలన్నీ విడుదల చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలి – టి.వరహాలు, చేనేత కార్మికుడు,ఉప్పాడ, యు.కొత్తపల్లి మండలం ఆప్కోకు రూ.11 కోట్ల బకాయిలు ఆప్కోకి రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 కోట్లు బకాయిలు ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం. ఉచిత విద్యుత్‌ పథకానికి సంబంధించి ఇప్పటికే జిఒ విడుదలైంది. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇంకా అమలు కావడం లేదు. – కురెళ్ల పెద్దిరాజు, ఆప్కో జనరల్‌ మేనేజర్‌ (ఎఫ్‌ఎసి) Follow us on Website Facebook Instagram YouTube