BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 05 April 2025, 08:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

యువ తేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన.

తెలంగాణ
05 Apr, 2025 - 08:29 AM
285 వీక్షణలు
యువ తేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఉద్యోగాలకు ఎంపిక అయన 3033 యువతకు నియామక పత్రాలు అందజేత చదువుకున్న యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉపాధి వైపు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో యువ తేజం కార్యక్రమం ద్వారా మెగా జాబ్ మేళాను నిర్వహించారు . నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు 6497 మంది నిరుద్యోగ యువతకు వచ్చారని, వీరందరికీ 132 వివిధ కంపెనీల హెచ్.ఆర్ ల ద్వారా ఇంటర్వ్యూ లు నిర్వహించి మొత్తం 3033 మందినీ ఎంపిక కాగా ఎల్.ఐ.సి ద్వారా పార్ట్ టైం పద్ధతిలో మరో 400 మందిని ఎంపిక చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువగా 45 వేల జీతానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు.కనీసం వేతనం15000 రూపాయలు తగ్గకుండా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు.ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారు మొదటి ఉద్యోగం అని తేలికగా తీసుకోకుండా, కష్టపడి పని చేయాలని ,రానివారు నిరాశ పడవద్దు అని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం యువతేజం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లా గా ఏర్పాటు,యువతకు కబడ్డీ పోటీలు లాంటి అనేక కార్యక్రమాల నిర్వహిస్తున్నామని తెలిపారు.యువతీ యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు.ఈ జాబ్ మేళాలో హాజరైన వారందరికీ కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో భోజన సదుపాయం కల్పించడం పట్ల రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ జాబ్ మేళాను విజయవంతం చేయుటకు కృషి చేసిన ఏఎస్పీ మౌనిక ఐపీఎస్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐలు, ఆర్.ఐలను,ఎస్.ఐలు, జాబ్ కో-ఆర్డినేటర్ రవి తేజ, తదితరులను జిల్లా ఎస్పీ అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube