BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 18 May 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

11,600 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన నూతన దంపతులు.. 12 జ్యోతిర్లింగాల దర్శనం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 02:09 PM
213 వీక్షణలు

మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్ జిల్లాకు చెందిన అజిత్ జగతాప్, ప్రియాంక జగతాప్ దంపతులు తమ వివాహానంతరం అరుదైన ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. సాధారణంగా నూతన దంపతులు హనీమూన్ కోసం విదేశీ పర్యటనలు, బీచ్ ప్రాంతాలను ఎంచుకుంటుండగా, ఈ జంట మాత్రం శివ భక్తితో 12 జ్యోతిర్లింగాల దర్శనం కోసం చెప్పులు లేకుండా పాదయాత్ర చేపట్టింది.

సుమారు 11,600 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది నెలల కాలంలో నడుచుకుంటూ పూర్తి చేశారు. ప్రతిరోజూ 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ మండుటెండలు, వర్షాలు, అలసటను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ శివునిపై ఉన్న అచంచలమైన విశ్వాసమే తమకు బలమైందని దంపతులు తెలిపారు.

గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ వరకు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించారు. ఈ యాత్రలో ప్రజల ప్రేమ, వివిధ రాష్ట్రాల సంస్కృతులు తమ జీవితానికి గొప్ప అనుభవాలను అందించాయని చెప్పారు.

“చాలాసార్లు అలసిపోయాం.. కిందపడిపోయాం.. కానీ జ్యోతిర్లింగాల దర్శనం చేయాలన్న సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది” అని అజిత్, ప్రియాంక పేర్కొన్నారు.

ఈ దంపతుల యాత్ర నేటి యువతకు దృఢ సంకల్పం, సంస్కృతి పట్ల గౌరవం, భార్యాభర్తల పరస్పర సహకారం ఎంత ముఖ్యమో చాటి చెబుతోంది. అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను కూడా పట్టుదలతో సాధించవచ్చని వారి ప్రయాణం నిరూపించింది.