BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 27 August 2026, 08:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ఇప్పటి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రధాని మోడీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:09 PM
46 వీక్షణలు

న్యూఢిల్లీ: 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలో క్రీడా వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా యువత, యువ అథ్లెట్లతో క్రీడలు, ఫిట్‌నెస్ అంశాలపై ప్రధాని మోడీ చర్చించారు.

దేశవ్యాప్తంగా 1,500కుపైగా కళాశాలల్లో ఖేలో ఇండియా కార్యక్రమాలను నిర్వహించినట్లు ప్రధాని తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు.

2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే వివిధ క్రీడా విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.