BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 10 January 2026, 09:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బొగ్గు గని కార్మిక సంఘం బలోపేతానికి పిలుపు

తెలంగాణ
10 Jan, 2026 - 09:56 AM
205 వీక్షణలు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బలోపేతానికి పిలుపు

SRP–CHPలో TBGKS కార్యకర్తల సమావేశం NTODAY NEWS: మంచిర్యాల జిల్లా న్యూస్ శ్రీరాంపూర్ ఏరియాలోని SRP–CHPలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికుల కోసం సాధించిన హక్కులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సింగరేణిలో కార్మికులకు లభిస్తున్న అనేక ప్రయోజనాలు గతంలో సాధించిన ఫలితమేనని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనలో కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. గుర్తింపు సంఘాలుగా చెప్పుకునే కొన్ని జాతీయ సంఘాలు కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నా, రాజకీయ జోక్యం పెరుగుతున్నా ఆయా సంఘాలు స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సింగరేణిని కాపాడుకోవాలంటే, కార్మికుల హక్కులను రక్షించాలంటే TBGKS యూనియన్‌ను సింగరేణి వ్యాప్తంగా బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. 25 మంది యూనియన్‌లో చేరిక ఈ సమావేశంలో యూనియన్ కార్యకలాపాలపై ఆకర్షితులై 25 మంది కార్మికులు యూనియన్‌లో చేరారు. వారిలో గండి సమ్మయ్య, ఎండి. ఫకూర్, బి. శ్రీనివాస్, బి. నరేష్, కే. ఆశోక్, కే. నాగరాజ్, ఏ. సంపత్, శివా, త్రివేణీ, సుమలత, కిష్టయ్య, కటకం శ్రీనివాస్, ఎల్. రవీందర్, అమరేందర్, బి. రాజేందర్, సునీల్, బి. భాస్కర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, ఏరియా, పిట్ స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube