BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 January 2026, 11:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రాణకవచం హెల్మెట్.. నిర్లక్ష్యం మృత్యుపాశం

తెలంగాణ
13 Jan, 2026 - 11:54 AM
380 వీక్షణలు

ప్రాణకవచం హెల్మెట్.. నిర్లక్ష్యం మృత్యుపాశం

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరు పట్టణంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “శిక్షణతో భద్రత – సాంకేతికత ద్వారా పరివర్తన” అనే అంశంతో అన్నా క్యాంటీన్ నుంచి ముడెప్ప సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల్లో సుమారు 70 శాతం హెల్మెట్ ధరించకపోవడమే కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను భారంగా భావించకూడదని, అది తమ కుటుంబానికి ఇచ్చే భరోసా అని పేర్కొన్నారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే సంపూర్ణ రక్షణ లభిస్తుందని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీఓ కార్యాలయ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. #RoadSafety #HelmetSavesLives #BikeRally #TrafficAwareness #Punganur #NationalRoadSafety #SafeDriving #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube