BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

అబద్దపు ప్రచారాలు చేసినందుకు రాష్ట్ర ప్రజలకు బాహాటంగా క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ
24 Oct, 2025 - 09:26 AM
189 వీక్షణలు
గూగుల్ అంటే అంత గుబులు దేనికని అబద్దపు ప్రచారాలు చేసినందుకు రాష్ట్ర ప్రజలకు బాహాటంగా క్షమాపణలు చెప్పాలి,, బిజెపి రాష్ట్ర అధికారి ప్రతినిధి,,,పెద్దిరెడ్డి రవికిరణ్,,, NTODAY NEWS: ప్రతినిధి.భోర శివారెడ్డి కాకినాడలో జరిగిన ప్రెస్ మీట్ రాష్ట్ర బిజెపి అధికారి ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ, విశాఖలో గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటు పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే వైసీపీ నేతలు మాత్రం గడిచిన వారం రోజులుగా విషం చిమ్మటాన్ని ప్రజలు చీ చీ అంటున్నారని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలో భాగంగానే ప్లేటు ఫిరాయించి అంతా తన వల్లే జరిగింది అంటూ మరో రకమైన అబద్ధపు ప్రచారానికి శ్రీకారం చుట్టారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతిదీ పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ కి సమానంగా రవికిరణ్ కాకినాడలో మాట్లాడుతూ వైసిపి నేతలు వాళ్ళ సోషల్ మీడియా గడిచిన వారం రోజులుగా గూగుల్ డేటా సెంటర్ అనవసరమని దీనివల్ల ఉత్తరాంధ్ర వాసులకు కరెంటు కష్టాలు తప్పవని త్రాగునీరు కష్టాలు వస్తాయని ఉద్యోగాలు పెద్దగా రావని చేసిన అసత్య అబద్ధ ప్రచారాలకి ముందు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అన్నారు. అయితే ప్రజల నుండి వస్తున్న తిరుగుబాటుని గ్రహించిన జగన్ నాలిక మడతపెట్టి ఈరోజు వాళ్ల పార్టీ నేతలు మాట్లాడుతున్న దానికి భిన్నంగా ఈ డేటా సెంటర్ నా వల్లే వచ్చిందని 2020లోనే నేను ఒప్పందం చేసుకున్నానని అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 12, 2019 న జీవో నెంబర్ 9 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదాని డేటా సెంటర్ ఏర్పాటుకి పచ్చజెండా ఊపేరని దాని తర్వాత 15వ తారీఖున విశాఖలో భూమి పూజ కూడా చేశారని రవి కిరణ్ గుర్తు చేశారు. Google డేటా సెంటర్ ఏర్పాటు ఘనత నాకు ఇవ్వాలని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చిన జీవోని కావాలనే విస్మరించటం ఎవరో పుట్టిన బిడ్డకి నేను తండ్రి అని చెప్పుకున్న చందంగా ఉంది అన్నారు. విడ్డూరం ఏమిటంటే ఇప్పుడు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందం కూడా గతంలో తాను ఆదానితో చేసుకున్న ఒప్పందానికి కొనసాగింపు అని చెప్పటం హాస్యాస్పదం అన్నారు. అదే నిజమైతే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని ఎందుకు అంటున్నారని మీ లెక్కన దాన్ని ఆదాని డేటా సెంటర్ అనాలి కదా అని రవికిరణ్ సూటి ప్రశ్న వేశారు. Google డేటా సెంటర్ నిర్మాణానికి ఆదాని సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చినంత మాత్రాన ఆ కంపెనీ ఆదానీది ఎలా అవుతుందని ఈ మాత్రం కూడా జగన్ తెలియదా అని రవికిరణ్ నిలదీశారు. ఇంత మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రభుత్వానికి గాని రాష్ట్ర ప్రజలకు గాని ఇంత పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడానికి స్వాగతిస్తూ శుభాకాంక్షలు చెప్పలేదని గూగుల్ అంటే అంత గుబులు దేనికని రవి కిరణ్ అడిగారు. ఇప్పటికైనా జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెబుతూ తమ కార్యకర్తలు మీడియా సోషల్ మీడియా వైసిపి నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలకి ప్రజలకి బాహాటంగా క్షమాపణ చెప్పాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. Follow us on Website Facebook Instagram YouTube