ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు
జాతీయం
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును Unique Identification Authority of India జూన్ 14, 2027 వరకు పొడిగించింది.
పౌరులు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను myaadhaar.uidai.gov.in ద్వారా ఆన్లైన్‌లో ఎటువంటి రుసుము లేకుండా అప్‌డేట్ చేసుకోవచ్చు.
అయితే ఈ ఉచిత సేవ కేవలం ఆన్లైన్ అప్‌డేట్‌లకే వర్తిస్తుంది. ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలు సవరించుకుంటే నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని UIDAI వెల్లడించింది.