BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 02 July 2026, 02:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగస్టు 30న నీట్ పీజీ-2026 పరీక్ష.. జులై 21 వరకు దరఖాస్తులకు అవకాశం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:38 PM
108 వీక్షణలు

జులై 02, 2026: దేశవ్యాప్తంగా పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (పీజీ)-2026 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 30న నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) అధికారికంగా ప్రకటించింది.

పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21 రాత్రి 11.55 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. అర్హత కలిగిన విద్యార్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నీట్ (పీజీ)-2026 ఫలితాలను సెప్టెంబర్ 30లోపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల నిర్వహించిన నీట్ రీ-ఎగ్జామ్ ప్రక్రియ పూర్తికాగా, ఆ పరీక్ష ఫలితాలు కూడా త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

దేశంలోని ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ (పీజీ) స్కోరు అత్యంత కీలకంగా ఉండటంతో, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. సిలబస్ పునశ్చరణ, మాక్ టెస్టులు, సమయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు పేర్కొంటున్నారు.