BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 08 April 2026, 07:35 pm
Posted by : యామనూరి మల్లికార్జున

ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 07:35 PM
125 వీక్షణలు

ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల ఏప్రిల్ 8 

నంద్యాల.... ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూకలు చేస్తున్న దాడులను తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా వెలికితీసి, ప్రజల ముందు ఉంచడంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆర్కే (రాధాకృష్ణ) గారు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో జరుగుతున్న పరిణామాలను, వాస్తవాలను పత్రికా ముఖంగా వెల్లడించడం పట్ల ఓర్వలేక వైసీపీ నేతలు ఈ దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని ఆయన విమర్శించారు. నిజాలు బయటపడుతుంటే తట్టుకోలేక భౌతిక దాడులకు దిగడం వైసీపీ నైజమని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై నిజాలు చెప్పినందుకు కార్యాలయాలపై దాడి చేయడం సమంజసం కాదని, ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పత్రికా సంస్థలపై, జర్నలిస్టులపై జరుగుతున్న ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిరోజ్ డిమాండ్ చేశారు.