BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 05 June 2026, 07:43 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

అబద్దాలతో పెన్షన్ దారులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
05 Jun, 2026 - 07:43 PM
89 వీక్షణలు

పెన్షన్స్ పంపిణి కోసం తేదీని ప్రకటించకుంటే ఉద్యమం చేస్తాం--వనం ఉపేందర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో 2 లక్షల మందికి చేయూత పెన్షన్స్ మంజూరు చేస్తామని, జూన్ 2న కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించి, జూన్ 2 న ఎందుకు పెన్షన్స్ మంజూరు చేయలేదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక  జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు శుక్రవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రములో ఉన్న సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపెల్లీ స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా  ఉపాధ్యక్షులు చిత్తలూరి శ్రీహరి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వనం ఉపేందర్  మాట్లాడుతూ 2023 డిసెంబర్ నెలలో జరిగిన ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న 11రకాల చేయూత పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తూ చేసుకున్నారని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్న దరఖాస్తులు చేసిన లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరుగుతున్న స్పందించడం లేదు. 2026 ఫిబ్రవరి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్స్ జూన్ 2 నాడు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన వలన లక్షలాది మంది చేయూత పెన్షన్స్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మీ సేవా కార్యాలయల నుండి సర్టిఫికెట్స్ తీసుకుని దరఖాస్తూ చేసుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నాడు అమలు చేస్తామని చెప్పిన కొత్త పెన్షన్స్ ఎందుకు మంజూరు చేయలేదు అని అన్నారు ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలో అనేక మీటింగ్లలో జూన్ 2న 2 లక్షల మందికి పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రగల్బలు పలికి చేతులు ఎత్తివేయడం ఎంత వరకు సమంజసం అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తూ పరిపాలన చేయాలనుకోవడం సిగ్గుచేటు అని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం చర్యలు తీసుకోవాలని లేని యెడల ఉద్యమం  తప్పదని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త పెన్షన్స్ పంపిణి కోసం వెంటనే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేని యెడల జిల్లాలో మంత్రుల పర్యటనలను అడ్డుకోవాలని చేయూత లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.