BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

అభివృద్ధి, సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 Jun, 2026 - 05:17 PM
31 వీక్షణలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల పరిపాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, బిజెపి చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని 7వ వార్డు ఇంద్రానగర్ కాలనీ అంబేద్కర్ భవన్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ  పిలుపు మేరకు పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కోరుతూ కాలనీలో మొక్కలు నాటారు. ​ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు 2014 నుండి 2026 వరకు మోదీ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, జిఎస్టి అమలు, యూపీఐ ద్వారా డిజిటల్ విప్లవం, 'మేక్ ఇన్ ఇండియా' విజయం అని. జన్ ధన్ ఖాతాలు, పీఎం ఆవాస్ యోజన ఇళ్లు, ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు, మరియు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడం.

​మౌలిక సదుపాయాలు మరియు రక్షణ: రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు, వందే భారత్ రైళ్లు, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్', చంద్రయాన్-3 విజయం సాధించామని తెలిపారు. ​సాంస్కృతిక మరియు సామాజిక మార్పులు: స్వచ్ఛ భారత్ మిషన్, అయోధ్య రామమందిర నిర్మాణం, నూతన పార్లమెంట్ భవనం, మరియు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శీను, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజెవైఎం నాయకులు కంబాలపల్లి సతీష్, సీనియర్ నాయకులు గోషిక వెంకటేష్, జయరాపు రామకృష్ణ, కంచర్ల శంకర్ రెడ్డి, ఈడుదల మల్లేష్, సిలివేరు నాగరాజు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.