BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 30 May 2026, 09:26 pm
Posted by : ఆనంద్ రెడ్డి

మే 31న హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో విశేష ధార్మిక కార్యక్రమాలు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / కీసర
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
30 May, 2026 - 09:26 PM
144 వీక్షణలు

వెంకులోనిగుట్టలో వెలసిన పవిత్ర క్షేత్రమైన హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 31-05-2026 ,ఆదివారం నాడు అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విశేష ఆధ్యాత్మిక మరియు ధార్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడనున్నట్లు దేవస్థాన చైర్మన్ మరియు ట్రస్ట్ సభ్యులు శ్రీమాన్ కందాడి హన్మంత్ రెడ్డి గారు తెలిపారు.

అధిక జ్యేష్ఠ మాసం మహిమ:

ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సంభవించే అధికమాసంలో వచ్చే అధిక జ్యేష్ఠ పౌర్ణమికి హిందూ ధర్మంలో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పుణ్యదినాన శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, గిరి ప్రదక్షిణలు చేయడం, దానధర్మాలు నిర్వహించడం మరియు తీర్థస్నానాలు ఆచరించడం ద్వారా అపారమైన పుణ్యఫలాలు, ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకొని దేవస్థానంలో స్వామి వారి విశేష అర్చనలు, పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, గిరి ప్రదక్షిణ, తీర్థ ప్రసాదాల పంపిణీ తదితర కార్యక్రమాలు భక్తి వైభవాలతో నిర్వహించబడనున్నాయి.

 కార్యక్రమ వివరాలు:

వేదిక: హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, వెంకులోనిగుట్ట

తేదీ: 31-05-2026 (ఆదివారం)

ఉదయం 5.00 గంటలకు: గిరి ప్రదక్షిణ ప్రారంభం

కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి వారి దివ్య దర్శనం పొందడంతో పాటు విశేష పల్లకి సేవలో పాల్గొని, ప్రత్యేక అర్చనల్లో భాగస్వాములై, తీర్థ ప్రసాదాలు స్వీకరించి హేమాద్రీశుడి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా దేవస్థాన కమిటీ వినమ్రంగా ఆహ్వానిస్తున్నది.

స్వామి వారి సేవలో…

శ్రీమాన్ కందాడి హన్మంత్ రెడ్డి

చైర్మన్ మరియు ట్రస్ట్ సభ్యుల

హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం

వెంకులోనిగుట్ట