BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 08:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు చిన్న పత్రికల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Sep, 2026 - 08:41 PM
15 వీక్షణలు

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర సంఘ అధ్యక్షులు హుస్సేన్ ఖాన్, కార్యదర్శి కలి శ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేశ్వరరావు (పండు–ఆంధ్ర డైరీ), కార్యదర్శిగా శేఖర్ (మంజీరా గళం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్.డి. జబీర్, కార్యదర్శి వై.వి. హరీష్ అధ్యక్షత వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు అభినందనలు తెలిపారు. చిన్న పత్రికల సంక్షేమం, మనుగడకు తమ సమాఖ్య అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్, కె. బాలసౌరి, షేక్ షకీర్ బాబ్జి, ఏపీ బీజేఏ అధ్యక్షులు పి. నారాయణరావు, సిటీ న్యూస్ సిబ్బంది విలేకరి కళ్యాణ్, కె. సోమశేఖర్, మిల్టన్, ఎం.వి.వి. సత్యనారాయణ, శ్రీనివాస్, సతీష్ కుమార్, మౌనిక, దాసరి చందు, ఎర్ర జయదాసు, వెంకటరావు, సన్నీ, రవికుమార్, సుధాకర్, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గం:

అధ్యక్షులు: ఉమామహేశ్వరరావు (ఆంధ్ర డైరీ పండు)

కార్యదర్శి: శేఖర్ (మంజీరా గళం సంపాదకులు)

కోశాధికారి: సుబ్రహ్మణ్యం (ప్రజాభూమి బ్యూరో)

సంఘటన కార్యదర్శి: సత్యనారాయణ

ఉపాధ్యక్షులు: షేక్ బాబ్జి, డి. సుధాకర్

సహాయ కార్యదర్శులు: రెడ్డి అప్పలనాయుడు (రవి), రామచంద్రరావు (చందు)