BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 20 April 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:23 PM
376 వీక్షణలు

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు
పేస్ రీడింగ్ సమస్యలతో పనికి దూరమైన కూలీలు

ముసునూరు మండలం 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలులో ఉన్న వి.బి.జి. రాంజీ పథకం కింద కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య, ఆముదాల లక్ష్మయ్య ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు.

ఎన్ఎస్పి కాలువ పూడిక పనులకు వెళ్లిన ఈ కూలీలు పేస్ రీడింగ్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి హాజరు నమోదు కాలేదు. ఎంత ప్రయత్నించినా ఫోటోలు తీసుకోవడం సాధ్యం కాకపోవడంతో “ఈరోజు పనిలేదు, ఇంటికి వెళ్లండి” అని అధికారులు చెప్పినట్లు వారు ఆరోపించారు.

కూలీల డిమాండ్లు

ఈ సందర్భంగా బక్కయ్య మాట్లాడుతూ:

  • జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలి
  • వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • రోజుకు రూ.600 కూలీ చెల్లించాలి
  • సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలి
  • కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఈ కార్యక్రమంలో వేముల చంటి, వేముల మహాలక్ష్మి, ఆముదాల చినబాబు, నంది పాము రాణి, పల్లెపాము భవాని తదితరులు పాల్గొన్నారు.