BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 03:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో చింతలపూడి సర్కిల్ పరిధిలో గోల్డ్ దొంగతనాలపై ఘన విజయాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 03:25 PM
221 వీక్షణలు

ఏలూరు జిల్లాలో చింతలపూడి సర్కిల్ పరిధిలో గోల్డ్ దొంగతనాలపై ఘన విజయాలు: ముగ్గురు అరెస్ట్, గోల్డ్ రికవరీ

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, చింతలపూడి సర్కిల్ – సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. సుస్మిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, చింతలపూడి సర్కిల్ పరిధిలో ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో జరిగిన రెండు గోల్డ్ దొంగతనాలపై వివరాలు వెల్లడించబడ్డాయి. సమావేశంలో సీఐ క్రాంతికుమార్, చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్, ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు.

గణిజర్ల గ్రామంలోని బుల్లా భూలక్ష్మి ఇంట్లో మధ్యాహ్నం ఏకాంత సమయంలో గోల్డ్ దొంగతనం జరిగి, మెయిన్ డోర్ తాళం మరియు బీరువా తాళాలను పగిలించి దొంగతనం జరిగింది.

ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఈ టీం అనుమానాస్పద వ్యక్తిని పట్టుకుని, అతని ఫింగర్ ప్రింట్లు పలు నేర స్థలాల ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అయ్యాయని వెల్లడించింది. 2024లో పాతిమపురం లో జరిగిన గోల్డ్ దొంగతనంలో కూడా అతని ఫింగర్ ప్రింట్లు మ్యాచ్ కావడంతో, ఈ వ్యక్తి సహా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది.

గణిజర్ల, పాతిమపురం ప్రాంతాల నుండి దొంగతనం చేసిన గోల్డ్ రికవరీ చేయబడి, ముగ్గురైన దుక్కిపాటి కిషోర్, కొట్టే రమేష్, మూర్ల చార్లెస్ ను రిమాండ్ చేసి కోర్టుకు తరలించారు. వీరు చింతలపూడి పరిసర ప్రాంత వాసులుగా ఉన్నారు.

ధర్మాజీగూడెం స్టేషన్ పరిధిలో జరిగిన మరో గోల్డ్ దొంగతనంలో బోడ్ ప్రతీప్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి, 38 గ్రాముల గోల్డ్ మరియు ఒక డ్యూక్ బైక్ రికవరీ చేశారు. అతడిని రిమాండ్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది.

చింతలపూడి సర్కిల్‌లో ఇంటికి తాళం వేసి పనులకు వెళ్ళే వారి ఇళ్ళను టార్గెట్ చేసి దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ కేసులలో సీఐ క్రాంతికుమార్, ఎస్ఐలు సతీష్ కుమార్, వెంకన్న, పీసీలు సీతా దేవయ్య, వెంకటేశ్వరావు, సత్యనారాయణకు జిల్లా పోలీస్ కేంద్రం నుండి ప్రశంస పత్రాలు అందజేయబడతాయి.