BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 12:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై డీపీవో ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 12:43 AM
76 వీక్షణలు

పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై డీపీవో ఆకస్మిక తనిఖీలు

ఏలూరు: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మజిగూడెంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమం ముగిసిన అనంతరం జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జి.వి.కె. మల్లికార్జునరావు పీజీఆర్‌ఎస్‌లో నమోదైన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా బోగోలు, కలరాయనగూడెం గ్రామపంచాయతీలను సందర్శించి, ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన సూచనలు చేశారు.

ఈ తనిఖీల్లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.పి.ఎన్. సుందరి, డిప్యూటీ ఎంపీడీవో ఎ. సుందరి, సంబంధిత గ్రామపంచాయతీల అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, పారిశుద్ధ్యం, తాగునీటి సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని డీపీవో ఆదేశించారు.