BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 12:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ..? రాజకీయ వర్గాల్లో చర్చ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 12:43 AM
100 వీక్షణలు

మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ..? రాజకీయ వర్గాల్లో చర్చ

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పార్లమెంట్ కార్యాలయంలో భేటీ కానున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ భేటీలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు తాను మద్దతు ఇస్తున్న నేపథ్యంలో తన పార్టీకి అన్యాయం జరగకుండా చూడాలని జగన్ కోరనున్నారని సమాచారం. పునర్విభజన పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాకుండా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా పులివెందుల, పుంగనూరు వంటి నియోజకవర్గాలను ఎస్సీ రిజర్వ్‌గా మార్చే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో, తాను బిల్లుకు మద్దతు ఇస్తున్న సమయంలో కూటమికి అనుకూలంగా పునర్విభజన జరగడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, ఈ భేటీపై గానీ, అందులో చర్చించబోయే అంశాలపై గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలుగానే ఉన్నాయి.