BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 05:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో పౌర సరఫరాల సేవలకు అంతరాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 05:41 PM
66 వీక్షణలు

ఏలూరు జిల్లాలో పౌర సరఫరాల సేవలకు అంతరాయం

సమాన పనికి సమాన వేతనం, సేవా కాలం ఆధారంగా వేతన స్లాబ్‌లు అమలు చేయాలని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

ఏలూరు జిల్లాలో పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గురువారం తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు సేవా కాలం ఆధారంగా వేతన స్లాబ్‌లు, వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగుల వివరాల ప్రకారం, ప్రస్తుతం కొత్తగా విధుల్లో చేరిన సెక్యూరిటీ గార్డులు, అటెండర్లకు నెలకు రూ.15 వేల నుంచి రూ.18,500 వరకు వేతనం చెల్లిస్తున్నప్పటికీ, ఐదు నుంచి పదిహేను సంవత్సరాలుగా నిరంతరంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు కూడా అదే స్థాయి వేతనం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగుల అనుభవానికి తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం లేకపోవడం వల్ల తీవ్ర నిరుత్సాహం నెలకొంటోందని తెలిపారు. కొత్త ఉద్యోగులతో సమానంగా వేతనం ఉండటం ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందని, దీని ప్రభావం విధుల నిర్వహణపై కూడా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అందువల్ల సమాన పనికి సమాన వేతనం అనే సూత్రంతో పాటు ఉద్యోగుల సేవా కాలం, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వేతన స్లాబ్‌లు, వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.