BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 06:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 06:07 PM
151 వీక్షణలు

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత: లారీలు నిలిచిపోతున్నాయి, రైతులు ఇబ్బందులు

ఏలూరు జిల్లా మైదానంలో ధాన్యం లోడింగ్ జరుగుతున్న సమయంలో ట్రక్ షీట్ల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ట్రక్ షీట్ల లభ్యం లేకుండా లారీలు నిలిచిపోతున్నాయి, దీంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం లోడింగ్ చేసే హమాలీలు కూడా లభించకపోవడంతో, రైతులు తమకు సంబంధించిన లారీలు ఎక్కడున్నా అక్కడే నిలబడి పోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోని సంచులతో పట్టుకుని కాటాలు వేయించుకుంటున్న హమాలీలు, సాయంత్రం 6 గంటల సమయానికి ట్రక్ షీట్లు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు పని ముగించుకుని వెళ్లిపోతున్నారు.

లారీ ఓనర్లు చెబుతున్నట్లు, ఒక ధాన్యం లోడు రవాణా చేయాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతోంది. అటు, లారీ ఓనర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆవేదన చెందుతుంటే, మరో పక్క లోడైన లారీలు ట్రక్ షీట్ల లేకుండా అక్కడే నిలిచి పోతున్నాయి.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో లారీ డ్రైవర్లకు తాగడానికి మంచినీరు, భోజనం సకాలంలో అందకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితులపై జిల్లా అధికారులు స్పందించి, వెంటనే ట్రక్ షీట్ల పంపిణీని సులభతరం చేయాలని, తద్వారా లారీ యాజమాన్యం, రైతులు, డ్రైవర్లకు కనీసం కొంత ఉపశమనం లభించాలని కోరుకుంటున్నారు.