BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:11 PM
80 వీక్షణలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి ఐ నుంచి కొత్త ఏవియేషన్ పాలసీ వరకు గ్రీన్ సిగ్నల్

అమరావతిలో ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన 50వ కేబినెట్ సమావేశంలో 34 కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అమరావతి అభివృద్ధి, పోలవరం, అవయవ మార్పిడి చట్టం, కొత్త ఏవియేషన్ పాలసీ, గ్రామీణ ఉపాధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, పర్యాటక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముఖ్యాంశాలు ఇవే..

అమరావతిలో "అమరావతి ఐ" పేరుతో లండన్ ఐ తరహా భారీ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి అనుమతి.

అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీ, ఫీజుల మినహాయింపు.

రాష్ట్రంలో అవయవ దానం, మార్పిడిని నియంత్రించేందుకు THOTA-2011 చట్టం అమలుకు ఆమోదం.

చీరాల, విశాఖపట్నంలో బీచ్ షాక్స్ పైలట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజ్-5, 5A పనులకు రూ.796.66 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతి.

అగ్రిగోల్డ్ కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు 21 కొత్త పోస్టుల మంజూరు.

అమరావతి హైకోర్టు భవన బాహ్య అభివృద్ధి పనులకు రూ.547.07 కోట్ల ఆమోదం.

రాష్ట్రానికి కొత్త ఏవియేషన్ పాలసీ 2026-31కు కేబినెట్ ఆమోదం.

2035 నాటికి 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్ ఏర్పాటు లక్ష్యం.

జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో VB-GRAMG ఉపాధి హామీ పథకం అమలు.

వివిధ జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల కోసం వందల ఎకరాల ప్రభుత్వ భూముల కేటాయింపు.

అమరావతిలో పలు ప్రభుత్వ, విద్యా, ప్రైవేటు సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ ఆమోదం.

ఈ సమావేశంలో వ్యవసాయం, ఐటీ, ఆరోగ్యం, జలవనరులు, రెవెన్యూ, పరిశ్రమలు, పురపాలక, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.