BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 12 July 2026, 01:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో కలకలం.. కడపలో 5 కరోనా కేసులు.. ఇద్దరి మృతిపై ప్రభుత్వ వివరణయ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 01:01 PM
179 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో ఐదు కోవిడ్-19 కేసులు నమోదుకావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇదే సమయంలో ఇద్దరు మరణించిన ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం, మరణించిన ఇద్దరూ ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రభుత్వానికి ఈ కేసులపై సమాచారం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.

నమోదైన ఐదు కరోనా కేసులపై ఆరోగ్యశాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోందని పేర్కొంది. వైరస్‌లో కొత్త రూపాంతరాలు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు బాధితుల నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని వెల్లడించింది.