BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 13 July 2026, 03:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏటిమొగ–ఎదురుమొండి బ్రిడ్జి సాధన మహా పాదయాత్రకు విశేష స్పందన

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 03:23 PM
97 వీక్షణలు

అవనిగడ్డ నియోజకవర్గంలో ఏటిమొగ–ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే డిమాండ్‌తో నిర్వహించిన మహా పాదయాత్రకు విశేష స్పందన లభించింది. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సింహాద్రి వికాస్‌బాబు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాదయాత్ర జరిగింది.

నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. ఏటిమొగ–ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో పాదయాత్ర కొనసాగింది.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు, బోర్డు సభ్యులు, దేవాదాయ శాఖ మాజీ చైర్మన్లు, వివిధ విభాగాల మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చల్లపల్లి మండల జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి–శివప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట సత్యనారాయణ (నాని), మహిళా అధ్యక్షురాలు బొందలపాటి లక్ష్మి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు వల్లూరి ఉమా, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కొల్లూరు సామియేల్, ఉపాధ్యక్షుడు మోతుకూరి ఏడుకొండలు, సీనియర్ నాయకుడు వెనిగళ్ల, అవనిగడ్డ మండల జెడ్పీటీసీ సభ్యుడు చింతలపూడి లక్ష్మీనారాయణ, చల్లపల్లి టౌన్ యువ నాయకులు తారక జగదీష్, గొర్రెపత్తి రమేష్, మహిళా నాయకురాలు అరజా తులసి, అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతి, మాజీ సర్పంచ్ ఉమా మౌని తదితరులు పాల్గొన్నారు.

మహా పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమాని, సానుభూతిపరుడికి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు సింహాద్రి రమేష్‌బాబు, సింహాద్రి వికాస్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.