BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

ఎస్‌ఐఆర్‌ సర్వే విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 06:05 PM
273 వీక్షణలు

​మంచిర్యాల, ప్రతినిధి: ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) సర్వే ప్రక్రియ విజయవంతం కావడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కోరారు. సోమవారం తన నివాసంలో "మీ ఓటు – మీ బాధ్యత" అవగాహన పోస్టర్లను విడుదల చేసిన ఆయన, జూలై 24తో ముగిసే ఈ సర్వే ద్వారా కొత్త ఓటరు నమోదు, తప్పుల సవరణ, పోలింగ్ కేంద్రం మార్పు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూలై 31న ముసాయిదా జాబితా విడుదలవుతుందని, అభ్యంతరాల అనంతరం అక్టోబర్ 31న తుది జాబితా వస్తుందని తెలిపిన ఎమ్మెల్యే, ఈ సర్వే వల్ల సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని, రేషన్ కార్డులు, పెన్షన్ల వివరాలను కూడా నవీకరించుకోవాలని పేర్కొంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ దర్నీ మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్య నారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & కార్పొరేటర్ తూముల నరేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గజ్జెల హేమలతలతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు