భద్రాచలంలో జాతీయ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్‌కు ఘన స్వాగతం
భద్రాచలం, జూలై 11: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా జాతీయ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ నాయకులు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
అనంతరం భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రోటోకాల్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగబద్ధమైన, బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటే పంచాయతీ రాజ్ చాంబర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తున్నామని పేర్కొన్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పుసులూరు నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులు శశికళ యాదవ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పుస్కూరి అశోక్ రావు, శ్రీశైలం యాదవ్, లోడిగ వెంకన్న యాదవ్, జెడ్పిటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు వడ్డె నారాయణరావు, సామినేని హరీప్రసాద్, వెంకట్, శంకర్ యాదవ్ పాల్గొన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు, వై. వినోద్ రాజు, వానపల్లి ముత్యాలరావు, కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య, గోగినేని వసుధ, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్లు కొండయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, గౌరవ సలహాదారులు ముల్లంగి రామకృష్ణ రెడ్డి, వీరభద్ర ఆచారి, పిల్లి సత్తిరాజు, కార్య నిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు గోపిరెడ్డి వెంకటేష్, యలవర్తి లక్ష్మి, ఇస్మాయిల్, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శులు భూమా గోపాల్ రెడ్డి, రామచంద్రుడు, నాగేంద్ర రెడ్డి, వివిధ జిల్లాల పంచాయతీ రాజ్ చాంబర్, సర్పంచుల సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.