BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మంత్రి చొరవతో పోలిమేర రహదారి పనులకు ఊరట.. రైతుల హర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 06:04 PM
696 వీక్షణలు

చాట్రాయి–విసన్నపేట మండలాల మధ్య ఉన్న పోలిమేర రహదారి నిర్మాణ పనులు కంకర కొరతతో నిలిచిపోయిన నేపథ్యంలో శనివారం రాత్రి నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని కలిసి సమస్యను వివరించారు.

సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి తిరువూరు నియోజకవర్గ అధికారులతో మాట్లాడి, విసన్నపేట మండల పరిధిలోని కొత్తచెరువు నుంచి రహదారి నిర్మాణానికి అవసరమైన కంకర తరలించేందుకు అనుమతులు ఇప్పించారు. దీంతో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఈ సందర్భంగా రైతులు మంత్రి కొలుసు పార్థసారధికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సరైన దారి లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సొంత నిధులతో రహదారి నిర్మాణం చేపట్టినా మధ్యలో పనులు నిలిచిపోవడంతో నిరాశకు గురయ్యామని తెలిపారు. మంత్రి చొరవతో సమస్య పరిష్కారం కావడంతో రహదారి నిర్మాణం పూర్తవుతుందనే ఆశ కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, రైతులు దార్ల వెంకటేశ్వరరావు, బూబత్తుల రాము, బూబత్తుల ప్రసాద్, మిద్దె చెన్నారావు, బూబత్తుల లక్ష్మణరావు, చీపి చంటి, నక్కా చెన్నారావు, దార్ల సర్వేశ్వరరావు పాల్గొన్నారు.