BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 06 August 2026, 07:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అగ్రహారంలో డ్రైనేజీ కష్టాలు.. ఇళ్లలోకి చేరుతున్న వర్షపు మురుగునీరు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 07:28 PM
50 వీక్షణలు

అగ్రహారంలో డ్రైనేజీ కష్టాలు.. ఇళ్లలోకి చేరుతున్న వర్షపు మురుగునీరు

  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.. శాశ్వత డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 6:

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అగ్రహారం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా గ్రామంలోని రహదారులు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన కాలువలు లేకపోవడంతో ఇళ్ల ముందు రోజుల తరబడి నీరు నిలిచిపోవడమే కాకుండా, పలుచోట్ల ఇళ్లలోకి కూడా చేరుతుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వర్షాల సమయంలో రోడ్లన్నీ బురదమయంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వృద్ధులు, చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రోడ్లపై నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇళ్ల ముందు, రహదారులపై నిలిచిన నీరు మురుగుగా మారడంతో గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. నిల్వ నీటిలో ఈగలు, దోమలు అధికంగా పెరుగుతుండటంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీటి దుర్వాసనతో ఇళ్లలో ఉండలేక, బయట తిరగలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

డ్రైనేజీ సమస్యపై పలుమార్లు స్థానిక పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెం మండల అభివృద్ధి అధికారి, పంచాయతీ అధికారులు వెంటనే అగ్రహారం గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇళ్ల ముందు నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించి, దోమల నివారణకు బ్లీచింగ్ పౌడర్ చల్లి, ఫాగింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే శాశ్వత పరిష్కారంగా గ్రామంలో నూతన డ్రైనేజీ కాలువల నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.