BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 06 August 2026, 08:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 08:42 AM
129 వీక్షణలు

అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ అంశంపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన కీలక నిర్ణయాలను వెల్లడించారు.

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, సంస్థకు చెందిన సుమారు 6 వేల ఎకరాల భూములను వేలానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. వేలం ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఐడీ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

అగ్రిగోల్డ్ సంస్థ మొత్తం రూ.6 వేల కోట్ల డిపాజిట్లు సేకరించగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచే రూ.3 వేల కోట్ల మేర డిపాజిట్లు సమీకరించినట్లు వెల్లడించారు. బాధితుల పూర్తి వివరాలను నమోదు చేసి పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

బాధితులకు బాండ్లు అందజేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ 15లోగా బాండ్ల జారీ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఈ నెల 11న ప్రధాన కార్యదర్శితో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

అగ్రిగోల్డ్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఆగస్టు 15లోగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు