BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 25 June 2026, 01:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణాపై మంత్రి పార్థసారధి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 01:15 PM
134 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు: డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో అందిన ఫిర్యాదు మేరకు నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో ఐసీడీఎస్‌కు సరఫరా చేయాల్సిన కోడిగుడ్ల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీసుకెళ్లారు.

ఫిర్యాదుపై స్పందించిన మంత్రి పార్థసారధి ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత కాంట్రాక్టును రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు సూచించారు.

పిల్లల పోషకాహారానికి ఉద్దేశించిన సరుకుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అక్రమాలను సహించబోమని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.