BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అకాల వర్షాలతో మొక్కజొన్న పంట నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:40 PM
90 వీక్షణలు

అకాల వర్షాలతో మొక్కజొన్న పంట నష్టం  ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి: రైతు, కౌలు సంఘాలు

వత్సవాయి, మార్చి 20:

వత్సవాయి మండలంలోని పోలంపల్లి, పెంటలేవారిగూడెం, డబ్బకుపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నది. నేలకొరిగిన పంటలను రైతు, కౌలు రైతుల సంఘాల నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.20 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు టి. రమేష్, కే. వెంకటేశ్వర్లు, జి. కృష్ణా, వై. వెంకటరత్నం, ఎ. మల్లికార్జునరావు, రైతులు కనకయ్య, గోపాలరావు, కె. శ్రీనివాసరావు, పి. జగన్నాధం, సీఐటీయూ నాయకుడు బి. రాము తదితరులు పాల్గొన్నారు.