BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 19 March 2026, 08:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్రమ సారాయి కట్టడి… నల్లబెల్లం భారీగా పట్టివేత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:23 PM
193 వీక్షణలు

అక్రమ సారాయి కట్టడి… నల్లబెల్లం భారీగా పట్టివేత

మహబూబాబాద్ జిల్లా: అక్రమ సారాయి తయారీపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ స్థాయిలో నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ దాడిలో, అక్రమ సారాయి తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని లారీ ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కురవి శివారు సోమ్లా తండా వద్ద లారీని అడ్డగించి తనిఖీ చేపట్టారు.

తనిఖీలో సుమారు రూ.8 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు.

ఈ ఘటనలో గుగులోత్ సుమన్ (మహబూబాబాద్), ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్‌ఐ తాహేర్ బాబా, కురవి ఎస్‌ఐ గండ్రాతి సతీష్, ఎస్‌ఐ జయకుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు.