BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 07:44 pm
Posted by : కూనురు మధు

అక్షరం నేర్పిన బడికి డిజిటల్ తోడ్పాటు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 Jul, 2026 - 07:44 PM
148 వీక్షణలు

అక్షరం నేర్పిన బడికి డిజిటల్ తోడ్పాటు 

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన 2000-2001 విద్యాసంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. చదువుకున్న పాఠశాలలపై మమకారంతో పాటు, సామాజిక బాధ్యతను గుర్తుంచుకుని శనివారం గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు  విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారంగా పూర్వ విద్యార్థుల బృందం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఒక ప్రింటర్ను, అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఒక స్మార్ట్ టీవీని విరాళంగా అందజేశారు. ​ సామాజిక సేవతో పాటు మానవత్వాన్ని చాటుకుంటూ తమతో పాటు పదో తరగతి చదివి, వివిధ కారణాలతో అకాల మరణం చెందిన తోటి మిత్రుల కుటుంబాలను వారు పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించి, తామున్నామనే భరోసా కల్పించారు. పూర్వ విద్యార్థుల సేవాభావాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. వారు అందించిన వస్తువులు విద్యార్థుల డిజిటల్ విద్యకు, పాఠశాల అవసరాలకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యువత ఇలా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏర్పుల భాస్కర్, ఎడ్ల నరేష్, పోశపోయిన యాదయ్య, మునుకుంట్ల రాజు, ఏర్పుల మురళి, తెల్సూరి నాగేష్, నూతి సత్యనారాయణ, జుంజు రాజు, జి. శంకర్, తాటి జానయ్య, ఎస్. రామకృష్ణ, ఏ. అంజి, ఏర్పుల రవి, బత్తుల రమేష్, ఆరూరి రమేష్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.