BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 22 June 2026, 03:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ ఆశ.. భర్త హత్య.. కూతురు చర్యతో తల్లి ఆత్మహత్య

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 03:10 PM
234 వీక్షణలు

 కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో, రిటైర్డ్ జవాన్ సందీప్ మంజరగి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భార్య సుమ, ఆమె ప్రియుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, భర్త వద్ద పనిచేసే యువకునితో సుమ అక్రమ సంబంధం పెట్టుకుని, భర్త పేరుపై ఉన్న రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం సెలైన్‌లో విషం ఎక్కించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనతో కుటుంబం తీవ్ర అపకీర్తి పాలవడంతో, సుమ తల్లి మహాదేవి తీవ్ర మనోవేదనకు గురైంది. కూతురు వ్యవహారంపై గ్రామంలో చర్చలు జరుగుతుండటంతో మానసికంగా కుంగిపోయిన ఆమె, హుక్కేరి తాలూకాలోని ఘోడగేరి గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబాన్ని కుదిపేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.