BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 04 July 2026, 12:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 12:46 PM
128 వీక్షణలు

ప్రతి సంవత్సరం జూలై 4న అమెరికా సంయుక్త రాష్ట్రాలు తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటాయి. 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛను ప్రకటిస్తూ అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

బ్రిటిష్ పార్లమెంట్ విధించిన అన్యాయమైన పన్నులు, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలోని 13 కాలనీలు తిరుగుబాటు చేశాయి. ఫ్రాన్స్ సహకారంతో జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటం అమెరికా చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది.

1776 జూలై 4న రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్, రూపొందించిన స్వాతంత్ర్య ప్రకటనను అధికారికంగా ఆమోదించింది. అనంతరం 1783లో జరిగిన ద్వారా బ్రిటన్ అమెరికా స్వాతంత్ర్యాన్ని అధికారికంగా గుర్తించింది.

ఈ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది అమెరికన్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బార్బెక్యూ విందులు, కవాతులు, సంగీత కార్యక్రమాలు, జాతీయ జెండా ప్రదర్శనలు, రాత్రివేళ బాణసంచా ప్రదర్శనలతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.