BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 09:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమలాపురం: కుక్కకాటు గాయాలకు రిన్‌ సబ్బుతో శుభ్రం.. ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 09:39 PM
1 వీక్షణలు

కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కుక్కకాటుకు గురైన చిన్నారులకు అందుతున్న వైద్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పిచ్చికుక్క కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు సక్రమంగా వైద్యం అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

చిన్నారుల గాయాలను వైద్య సిబ్బంది రిన్‌ సబ్బుతో శుభ్రం చేస్తున్న దృశ్యాలు బయటకు రావడం కలకలం రేపింది. వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆసుపత్రిని సందర్శించి కుక్కకాటుకు గురైన చిన్నారుల పరిస్థితిని పరిశీలించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ఆసుపత్రిలో చిన్నారులకు అందుతున్న చికిత్సపై శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుక్కకాటుకు గురైన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం, అవసరమైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

కుక్కకాటు బాధిత చిన్నారుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.