BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి అజరామరం – సంబరాల్లో చనుబండ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 08:48 PM
379 వీక్షణలు

అమరావతి అజరామరం – సంబరాల్లో చనుబండ

దేవతల రాజధానిగా చరిత్రలో వెలుగొందిన అమరావతి తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అజరామరంగా నిలవాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం చనుబండలో కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. టపాసులు కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్ధత లభించడం పట్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ… 2014లో విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించి, సుమారు 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి భూములు ఇచ్చిన రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపిస్తూ, ఆ అన్యాయాలపై ప్రజలు గట్టిగా స్పందించి వైసీపీని ఘోరంగా తిరస్కరించారని పేర్కొన్నారు. ఇకపై ఎవ్వరూ అమరావతి రాజధానిని కదిలించలేరని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలని, అందుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, జక్కంపూడి ప్రదీప్, బొంతు సతీష్, పరసా శ్రీను, నెక్కలపు వెంకటేశ్వరరావు (చౌదరి), బన్నే వీరాస్వామి, బొట్టు దుర్గారావు, అవలపాటి శ్రీహరి, రసూల్ దాదా, బస్సు తిరుపతయ్య, గొల్లమందల వెంకటేశ్వరరావు, రాట్నాలు, చేకు పరమేష్, వెల్లంకి నాగ మహేశ్వరరావు, సన్నీ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.