BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 06:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి: సీపీఐ(ఎం)

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 06:46 AM
53 వీక్షణలు

మధిర రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి: సీపీఐ(ఎం)

మధిర: మధిర రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ మంజూరు చేయాలని సీపీఐ(ఎం) నాయకులు విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ సోనిక్యకు వినతిపత్రం సమర్పించారు.

రైల్వే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

అలాగే గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ప్రధాన రైళ్లకు మధిర రైల్వే స్టేషన్‌లో హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు పడకంటి మురళి, మందా సైదులు తదితరులు పాల్గొన్నారు.