BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 06:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 06:46 AM
61 వీక్షణలు

ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, బాపట్ల జిల్లాలో 1 కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 9 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 3 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 4 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే అవసరమైన చోట్ల మాస్క్‌ ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.