BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 06:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నీట్ పేపర్ లీకేజీపై నిరసన.. దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 06:47 AM
41 వీక్షణలు

నీట్ పేపర్ లీకేజీపై నిరసన.. దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

విస్సన్నపేట, జూలై 23: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విస్సన్నపేట జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ నాయకుడు విస్సంపల్లి నాగరాజు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఘటన అని విమర్శించారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చిందని, విద్యార్థులు, విద్యాసంస్థలు ఈ బంద్‌ను విజయవంతం చేయాలని నాగరాజు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శీను, రాము, విద్యార్థులు పాల్గొన్నారు.