BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 06:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం – చాట్రాయిలో సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 06:58 PM
180 వీక్షణలు

 పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ బిల్లు ఆమోదం పొందగా, ఈరోజు రాజ్యసభలో కూడా మూజివాణితో అదే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి సమర్పించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బళ్ళా రాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోవడం రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేసే శుభపరిణామమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల కృషి ఎంతో కీలకమని కొనియాడారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.