BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 07:41 pm
Posted by : యామనూరి మల్లికార్జున

అంబేద్కర్, జగ్జీవన్ రామ్ అందరివాళ్లు -విశ్వ హిందూ పరిషత్ , నంద్యాల

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 07:41 PM
127 వీక్షణలు

అంబేద్కర్, జగ్జీవన్ రామ్ అందరివాళ్లు విశ్వ హిందూ పరిషత్

బుధవారం నంద్యాల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం నందు

 సామాజిక సమరసత సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ వినాయకరావు దేశ్ పాండే  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....

డాక్టర్ భీమ్ రామ్ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వాడు కాదని,

వారు యావత్ భారతదేశానికి చెందినటువంటి అభిమాన నాయకుడని,

యావత్ భారతజాతిని జాతీయత భావముతో ముందుకు నడిపిన నాయకుడు అంబేద్కర్ గారు అని, 

బలవంతపు  మతమార్పిడులను ప్రోత్సహించటం భారతదేశనికి మంచిది కాదని స్వతంత్ర రాక పూర్వమే బాహాటంగా చెప్పిన ఏకైక నాయకుడు 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారు తెలిపారు.

బాబు జగ్జీవన్ రామ్ 50 సంవత్సరాలు వరుసగా ఎంపీగా ఉంటూ ప్రపంచ రికార్డును సృష్టించారు వారు కూడా సామాజిక సమరసత కోసం పోరాడారు.

దాంతోపాటు బలవంతపు మతమార్పిడులను వారు అడ్డుకున్నారు వారు బాల్యం నుంచే అంటరానితనాన్ని ఎదిరించారు అంతటి గొప్ప వ్యక్తి ఏ ఒక్క కులానికి ఏ ఒక్క మతానికి ఆపాదించడం సరికాదని బాబు జగ్జీవన్ ప్రజా నాయకుడని వారు కొనియాడారు.

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతులను విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తుందని,గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత వైభవోపేతంగా చేయబోతుందని ప్రాంత  ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు అన్నారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ మాట్లాడుతూ మతం మారి వెళ్లిన దళిత సోదరులు తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని స్వధర్మం కంటే మించింది మరేది లేదని  ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలంటే   

బలవంతపు మతమార్పిడులు ఉండకూడదని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో  పట్టణంలోని వివిధ కుల సంఘాల నాయకులు, రిటైల్  మర్చంట్ అసోసియేషన్ సభ్యులు 

విశ్వ హిందూ పరిషత్ జిల్లా మరియు ప్రఖండ  స్థాయి నాయకులు పాల్గొన్నారు.