జగిత్యాల–వెల్గటూర్ రూట్‌లో అదనపు బస్సు నడపాలి
తెలంగాణ
జగిత్యాల–వెల్గటూర్ రూట్‌లో అదనపు బస్సు నడపాలి
ఒకే బస్సుతో విద్యార్థులు, నిత్య ప్రయాణికుల అవస్థలు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డిపో మేనేజర్ స్పందించాలని విజ్ఞప్తి
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
జగిత్యాల నుంచి వెల్గటూర్ మీదుగా వెళ్లే రూట్‌లో సరిపడా బస్సులు లేక విద్యార్థులు, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొల్లపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ రూట్‌లో ఒకే బస్సు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రయాణం కష్టతరంగా మారింది.
కిక్కిరిసిన బస్సు… ప్రాణాలకు ముప్పు
జగిత్యాల–వెల్గటూర్ మార్గంలో రోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉన్న ఒక్క బస్సులోనే ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. బస్సులో చోటు లేక కొందరు విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నిలబడి, ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. సమయానికి బస్సు దొరకక తరగతులకు ఆలస్యమవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు విజ్ఞప్తి
ఈ సమస్యపై స్థానిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ తక్షణమే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రయాణికుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ రూట్‌లో వెంటనే అదనపు బస్సు సర్వీసులు ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
#Jagtial #Velgatur #RTCBus #StudentIssues #PublicTransport #RoadSafety #AdditionalBus #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube