BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 21 April 2025, 10:08 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సర్వే నెంబరు 50 లో ఉన్న భూములపై విచారణ జరపాలి

తెలంగాణ
21 Apr, 2025 - 10:08 PM
394 వీక్షణలు
సర్వే నెంబరు 50 లో ఉన్న భూములపై విచారణ జరపాలి,మండలంలో ఉన్నసమస్యలు పరిష్కరించాలి --దాసరి పాండు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు NTODAY NEWS: బొమ్మలరామారం, ఏప్రిల్ 22 సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రోజున ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ బొమ్మలరామారం మండలంలో ఏళ్ల తరబడిగా మండలంలో ప్రజల స్థానిక సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులు తమ భూమికి పట్టా సర్టిఫికెట్ కావాలని భూములు పట్టా చెయ్యాలని, బొమ్మలరామారం మండలంలో లింకు రోడ్ల సమస్యలు పరిష్కరించాలని మండల పరిధి నుండి గ్రామాలకు వెళుతున్న తారు రోడ్లు సిసి రోడ్లు గుంతలమైపోయిన పట్టించుకోవడంలేదని వెంటనే పరిష్కారం చేయాలని కోరారు సాగు, త్రాగునీటి సమస్య పరిష్కారం కావడం కోసం అవకాశమున్న మేడ్చల్ జిల్లాలో ఉన్న శామీర్పేట చెరువును రిజర్వాయర్ చేయాలని మండలానికి వెయ్యిల ఎకరాల భూమికి సాగుకు ఉపయోగపడుతుంది అని అన్నారు మండల కేంద్రంలో ఉన్న సర్వే నెంబర్ 50లో ఖస్రా, పహాని ప్రకారం భూమి రికార్డులో 711 ఎకరాలుగా ఉండవలసిన భూమి1100 ఎకరాలు నమోదు కాబడిన విషయాన్ని గతంలో కలెక్టర్కు తాహసిల్దార్ కు ఇట్టి విషయంలో విచారణ చేయాలని కోరిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు 50 సర్వే నంబర్ లో భూములు ఉన్న రైతులకు పట్టా పుస్తకాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు 50 సర్వే నంబర్ భూములకు డబుల్ రిజిస్ట్రేషన్ చేసినారని నిజమైనా రైతులకు పట్టా చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నారని పెట్టుబడిదారులకు భూస్వాములకు స్థానిక ఉన్న రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని అన్నారు వెంటనే 50 సర్వే నంబర్ భూముల పై విచారణ జరపాలని కోరారు గతంలో ప్రభుత్వము ఇంటి స్థలాల కోసం ఇచ్చిన స్థలాల్లో పేదలు ఇల్లు నిర్మాణం చేసుకున్న నేటికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అన్నారు మండలంలో ఉన్న క్రషర్ల లు, కెమికల్ ఫ్యాక్టరీల వల్ల గ్రామాల్లో మండల కేంద్రంలో బ్లాస్టింగ్ వల్ల ఇండ్ల గోడలు, టీవీలు వగైరా ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు పగిలిపోతున్నాయని అన్నారు విష కాలుష్యం వల్ల ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారని ఈ లాంటి సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం నాయకులు ముక్యర్ల పున్నమ్మ, దేవేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజు, సత్యనారాయణ, నరసమ్మ , మంగ లక్ష్మీ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube