BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 26 March 2026, 10:12 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి అనుదీప్ మృతి కేసులో కొత్త ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 10:12 AM
550 వీక్షణలు

అనుదీప్ మృతి కేసులో కొత్త ట్విస్ట్… ప్రత్యేక అధికారిగా రాజశేఖర్ ఎంట్రీ!

చాట్రాయి : చాట్రాయిని కుదిపేసిన అంబటి అనుదీప్ అనుమానాస్పద మృతి కేసు మరింత ఉత్కంఠభరిత మలుపు తిరిగింది. కేసులో నిజానిజాలు బయటకు తేల్చేందుకు పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నియమించినట్లు సమాచారం. దీంతో కేసులో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రానున్నాయన్న చర్చలు జోరందుకున్నాయి.

అనుదీప్ మృతి వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని కుటుంబ సభ్యులు మొదటి నుంచే ఆరోపిస్తూ వస్తుండగా, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశాలు ఇవ్వడం కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. స్థానిక పోలీసులపై నమ్మకం కోల్పోయిన కుటుంబీకుల డిమాండ్‌తో ఎస్పీ తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కేసు చుట్టూ అనేక అనుమానాలు తిరుగుతుండగా, ప్రేమ వ్యవహారం కోణం పెద్దగా చర్చనీయాంశమైంది. ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యుల పాత్ర ఎంతవరకు ఉందో, స్నేహితుల పాత్ర ఏంటన్నదానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా అనుదీప్ మృతి ముందు జరిగిన కాల్స్, మెసేజ్‌లు, కదలికలపై సుదీర్ఘంగా దర్యాప్తు జరగనుంది.

అత్యంత కీలకంగా మారిన అంశం ఏమిటంటే… మృతదేహం వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ఎలా అదృశ్యమైంది? దానిని ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు కేసులో మిస్టరీగా మారాయి. ఈ ఫోన్ ట్రైల్ బయటపడితే కేసు మొత్తం దిశ మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

సీఐ రాజశేఖర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పడి, కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అనుమానితుల జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఎవరు ఎంత ప్రభావశీలులైనా ఉపేక్షించబోమన్న ధోరణిలో విచారణ సాగనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

దీంతో “అనుదీప్ మృతి హత్యా? ఆత్మహత్యా? లేక మరేదైనా కుట్రా?” అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుందన్న ఉత్కంఠ నెలకొంది. స్థానికుల్లోనూ కేసుపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ దర్యాప్తు చివరకు ఎవరిని చిక్కుల్లో పడేస్తుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు చాట్రాయిని ఉలిక్కిపడేలా చేస్తోంది.